Friday, 10 March 2017

పదో తరగతి విద్యార్థులకు విద్యాశాఖ సూచనలు

పదో తరగతి విద్యార్థులకు విద్యాశాఖ సూచనలు

      
 పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 14 వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 : 45 నిమిషాల వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ పలు సూచనలు జారీ చేశారు.

* పరీక్షా ప్రారంభానికి ఒక గంట ముందు నుంచే అంటే ఉదయం 8:30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష హాల్‌లోకి అనుమతి ఇస్తారు.

* విద్యార్థులు స్కూల్ యూనిఫాంలో పరీక్షా కేంద్రాలకు రాకూడదు.

* విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్, పరీక్ష ప్యాడ్‌ను తీసుకు రావాలి.

* సెల్‌ఫోన్‌లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష హాల్‌లోకి అనుమతించబడవు.

* ఉదయం 9 : 30 గంటల తర్వాత విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరగదు.

* విద్యార్థులు హాల్ టికెట్లను WWW.BSETEL ANGANA.ORG నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

* వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో కూడా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.

* హాల్ టికెట్‌పై ఫొటో ప్రింట్ కాకపోతే ఒక ఫొటోనే అతికించి ఎవరైనా గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించుకోవాలి

No comments:

Post a Comment